బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా బుధవారం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడ్డాక మొదటి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ రూ.3,04,965 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా భట్టి బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రత్యేక నిధులను కేటాయించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ఏకంగా రూ. 56,084 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో..
- మహాలక్ష్మి పథకానికి రూ. 4,305 కోట్లు
- గృహ జ్యోతి పథకానికి రూ. 2,080 కోట్లు
- సన్న బియ్యంకు రూ.500 బోనస్ పథకానికి రూ.1800 కోట్లు
- రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1,143 కోట్లు
- గ్యాస్ సిలిండర్ సబ్సీడీ పథకానికి రూ. 723 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు
- రైతు భరోసా పథకానికి రూ.18,000 కోట్లు
- చేయుత పథకానికి రూ. 14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇళ్లు పథకానికి రూ. 12,571 కోట్లు కేటాయించడం జరిగింది.