KCR చెప్పినట్లు జరిగితే.. తెలంగాణలో 16 లక్షల ఎకరాలు ఎడారే: బక్క జడ్సన్​

సీఎం కేసీఆర్‌పై కేంద్ర జల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ ​సీనియర్​నేత బక్క జడ్సన్​ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2023-02-09 15:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై కేంద్ర జల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్​ సీనియర్ ​నేత బక్క జడ్సన్​ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ​నుంచి నీళ్లు తరలించే నిర్ణయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు. బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర లిఫ్ట్ పెట్టి శ్రీరాం సాగర్‌కు నీళ్లు ఎత్తుకు పొమ్మని సీఎం కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇది జరిగితే 16 లక్షల ఎకరాలు తెలంగాణలో ఎడారిగా మారిపోతాయన్నారు. ప్రజలను నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తన కంప్లైట్​ లో కోరారు.

Also Read..

సీఎం కేసీఆర్‌తో భేటీపై క్లారిటీ ఇచ్చిన MLA జగ్గారెడ్డి 

Tags:    

Similar News