Hijra's Attack: హిజ్రాల వీరంగం... ఏకంగా నడిరోడ్డుపై ఆ పని చేస్తూ హల్చల్
రాష్ట్రంలో హిజ్రాల (Hijras) ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హిజ్రాల (Hijras) ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, జాతీయ రహదారులు, దుకాణ సముదాయాలు, ఫంక్షన్ హాళ్లు, శుభాకార్యాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి వారు సామాన్యుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక ఇవ్వకపోతే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. అక్కడి నుంచి కదలడం లేదు. అసలు ఎందుకు డబ్బులివ్వాలని ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగుతూ.. దాడులకు సైతం తెగబడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు.
ఈ క్రమంలోనే తాజాగా.. ఖమ్మం జిల్లా (Khammam District) మధిర పట్టణం (Madhira Town)లో హిజ్రా గ్యాంగ్ (Hijra's Gang) బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి హిజ్రాలు మద్యం మత్తులో యథేచ్ఛగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలోనే డబ్బులివ్వని డీసీఎం డ్రైవర్ క్యాబిన్లోకి ఎక్కి అతడిపై దాడి చేశారు. అనంతరం డీసీఎం తాళాలను సైతం లాక్కున్నారు. నడిరోడ్డుపై పదుల సంఖ్యలో వాహనాలను ఆపి హిజ్రాలు హల్చల్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.