Rain Alert:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(శుక్రవారం) భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-11-01 01:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(శుక్రవారం) భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నిన్న(గురువారం) పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News