CM Revanth Reddy : రవీంద్ర భారతిలో కొలువుల పండగ కార్యక్రమం
రవీంద్ర భారతి(Ravindhra Bharathi)లో గురువారం "కొలువుల పండుగ"(Koluvula Pandaga) కార్యక్రమం ఘనంగా జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : రవీంద్ర భారతి(Ravindhra Bharathi)లో గురువారం "కొలువుల పండుగ"(Koluvula Pandaga) కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాల(Compassionate Appointments) కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క(Minister Seethakka) హాజరయ్యారు. అయితే ఎంపికైన ఈ 922 మందిలో 582 మంది కారుణ్య నియామకాలతో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు ఉన్నారు. కారుణ నియామాకాలను అమోదించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.