బాచుపల్లి నారాయణ జూనియర్ కాలేజీ స్టాఫ్ మొత్తాన్ని మార్చండి.. మహిళా కమిషన్ చైర్మన్ ఫైర్

తెలంగాణ వ్యాప్తంగా బాలికల కాలేజీ హాస్టళ్లలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-22 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా బాలికల కాలేజీ హాస్టళ్లలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె ఆరా తీస్తున్నారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. తాజాగా బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే మరోసారి బాచుపల్లి నారాయణ జూనియర్ కాలేజీలో చైర్మన్ నేరెళ్ల శారద విజిట్ చేేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడారు.

అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇదే కాలేజీని కొన్ని రోజుల ముందే తనిఖీ చేశానని ఆమె తెలిపారు. అప్పుడు విద్యార్థులు నా దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తే పరిష్కారం చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పానని గుర్తు చేశారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొంత మంది స్టాఫ్‌ను మార్చాలని చెప్పినట్లు తెలిపారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదని, వారు అలాగే కంటిన్యూ అవుతున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన తర్వాత వారు లీవ్ పెట్టుకుని వెళ్లిపోయారని అన్నారు. అందరూ సిక్ లీవ్ పెట్టుకోని వెళ్లిపోయారని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరమని, అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారని ఫైర్ అయ్యారు. నేను మళ్లీ చెప్తున్నాను.. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌ లో నేను తనిఖీలు చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందన్నారు.


Similar News