మధ్యాహ్నం CM రేవంత్ ప్రెస్‌మీట్.. ఆ ఒప్పందాలు, లెక్కలన్నీ బట్టబయలు చేయనున్నారా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి జరిగిన కృష్ణా జలాల ఒప్పంద వివరాలు వెల్లడించాలని ఫిక్స్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి జరిగిన కృష్ణా జలాల ఒప్పంద వివరాలు వెల్లడించాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. కేబినెట్ భేటీకి ముందే కేఆర్‌ఎంబీ వివాదంపై స్పందించనున్నారు. కాగా, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ చేతగాకే కేఆర్ఎంబీకి అప్పగించారని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు.. కృష్ణానది జలాల పంపిణీ అంశం ట్రిబ్యునల్ వద్ద తేలకముందే కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి దాసోహమైనట్టు స్పష్టమవుతున్నదని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల ఔట్‌లెట్స్‌ను ఈఎన్‌సీ బోర్డుకు అప్పగించారనే విషయం బోర్డు సమావేశ మినిట్స్ ద్వారా వెల్లడవుతున్నదని చెప్పారు. దీంతో ఈ అంశంపై స్పందించాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మధ్యాహ్నం ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు.