మరి కాసేపట్లో ఢిల్లీకి రేవంత్.. సీఎం హస్తినా టూర్‌పై తీవ్ర ఉత్కంఠ..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఐదు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఐదు గంటలకు రెగ్యులర్ ఫ్లైట్‌లో వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) రేపు (శనివారం) కీలక భేటీకి పిలుపునిచ్చింది. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగనున్న ఫస్ట్ సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి హస్తినా టూర్‌కు వెళ్తున్నారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ మెంబర్స్‌తో పాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచందర్‌రెడ్డితో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ కూడా పీసీసీ చీఫ్ హోదాలో ఈ భేటీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీలు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు, పొందిన ఓట్ షేర్‌కు సంబంధించిన వివరాలను హైకమాండ్‌కు వివరించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. దీంతో సీఎం హస్తినా పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.