CPI : బాల మల్లేశ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-12-01 09:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: (CPI Telangana) సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో బాల మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు. కాగా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్ శనివారం గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. బాలమల్లేశ్ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వామపక్షల నేతలు సంతాపం తెలియజేశారు.

బాల మల్లేశ్ హఠాన్మరణం తీవ్రమైన దిగ్భ్రాంతిని, మనస్థాపాన్ని కలిగించిందని కూనంనేని సాంబశివరావు తెలిపారు. వారి భౌతిక కాయాన్ని పార్టీ నాయకుల, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ఉంచుతారని, తదనంతరం సాయంత్రం 4 గంటలకు యాప్రాల్‌లో అంత్యక్రియలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో కూనంనేని వెల్లడించారు.

Tags:    

Similar News