సినీ ప్రముఖుల ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ ప్రముఖుల ముందే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ ప్రముఖుల(Movie celebrities) ముందే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి తన ఆవేదన(Anguish) వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను ప్లే చేపించి చూపించినట్లు తెలుస్తుంది. అనంతరం సీఎం సినీ ప్రముఖులతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటన(stampede incident)లో హీరో, థియేటర్ యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరించారని, ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే సినీ పరిశ్రమకు సామాజిక బాధ్యత ఉండాలని.. సినిమాల్లోనే కాకుండా.. నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షో(Benefit show)లు ఉండవని తాను అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని, శాంతి భద్రతలు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని.. సినీ పెద్దల మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉందని భరోసా ఇచ్చారు.
Read More...
CM Revanth: సినీ ఇండస్ట్రీ పెద్దలకు బిగ్ షాక్.. బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన