Breaking News : గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణలోని గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభవార్త తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభవార్త తెలిపారు. నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. గ్రామ్యస్థాయిలో పనిచేసే 92351 మంది ఉద్యోగుల జీతాల(Salaries) గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతోపాటు గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలు కూడా ఏకకాలంలో చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బకాయిలన్నీ రెండు మూడు రోజుల్లోగా విడుదల చేయాలని, ఒక్కరూపాయి కూడా పెండింగ్ లో ఉండకుండా పూర్తిగా చెల్లించాలని అధికారులకు సూచించారు. కాగా అతి త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు(Local Body Elections) జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే సీఎంతో సహ కీలక నేతలంతా సన్నాహాలు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని గ్రామస్థాయిలోకి బలంగా తీసుకు వెళ్లాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.