రతన్ టాటా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం పారిశ్రామిక రంగానికే తీరని లోటని పేర్కొన్నారు.

Update: 2024-10-10 02:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) మరణవార్త యావత్ దేశాన్ని కలచివేసింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (అక్టోబర్ 9) రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. టాటా మృతిపై ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, ఆయన మరణం పారిశ్రామిక రంగానికి తీరనిలోటు అని అని పేర్కొన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. టాటా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:    

Similar News