CM Revanth Reddy : మళ్ళీ మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి మహారాష్ట్ర(Maharashtra) వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెలుతున్నారు.

Update: 2024-11-15 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి మహారాష్ట్ర(Maharashtra) వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెలుతున్నారు. ఈ రోజు రాత్రి, లేదా రేపు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర కు చేరుకుంటారు. ముూడు రోజుల పాటు కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇప్పటికే పలు ధఫాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం సాగించారు. శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా రేవంత్‌రెడ్డి బుధవారం ముంబైలోని వర్లీలో రోడ్‌షో నిర్వహించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా పాల్గొంటున్న రేవంత్‌కు దారి పొడవునా ఫ్లెక్లీలు ఏర్పాటు చేసి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమిలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్డీయే కూటమి తరుపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి అధిత్య నాథ్ లు ప్రచారం సాగిస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీఏ నుంచి కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రచారంలో సందడి చేశారు. తమ మిత్రపక్ష నేత అయిన ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముంబైలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి బీజేపీ నేతలు ఆహ్వానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రేపు, ఎల్లుండి ప్రచారం చేస్తారని సమాచారం. 

Tags:    

Similar News