Minister Ponnam : కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ ఉంది : మంత్రి పొన్నం

కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Caste census household survey)లో కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ ఉందని..సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సూచించారు.

Update: 2024-11-15 09:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Caste census household survey)లో కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ ఉందని..సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సూచించారు. సిద్ధిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో 9 వ వార్డులో పంజర్ల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కోఠి 16 లక్షల ఇళ్లకు 85 వేల మంది ఎన్యుమరెటర్స్ తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని, 35 శాతం సర్వే పూర్తైందని వెల్లడించారు.

అధికారులకు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా సహకరిస్తున్నారని, రాజకీయ పార్టీలు అనవసర దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దుద్దెడలో పంజాల కవిత ఇంటికి సర్వేకు వచ్చామని, ఎక్కడా ఇబ్బందికర ప్రశ్నలు లేవని, బ్యాంకు అకౌంట్లు ,డాక్యుమెంట్ లు అడగడం లేదన్నారు. తెలంగాణలో కొత్త ప్రణాళిక తో ప్రజా పాలన ద్వారా ముందుకు పోతున్నామని, సర్వేలో అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని కోరారు. ఎన్యుమరేటెర్స్ ను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

Tags:    

Similar News