వర్షాలపై వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-12-24 16:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 5 రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదిలాబాద్‌లో 18 డిగ్రీలకు చేరింది.

Tags:    

Similar News