Minister Ponnam : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే : మంత్రి పొన్నం

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు(Buying pady)చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)స్పష్టం చేశారు.

Update: 2024-11-15 09:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు(Buying pady)చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు ఉండేలా ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలు లోపు పేమెంట్ జరుగుతుందని, రైతులు ఎవరు బయట అమ్ముకోవద్దన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పండని రైతులకు సూచించారు. రైతులు మార్కెట్ యార్డు కావాలని నా దృష్టికి తీసుకొచ్చారని, మార్కెట్ యార్డు కోసం స్థల పరిశీలన చేయాలని ఆర్డీవో ను ఆదేశించడం జరిగిందని వెల్లడించారు.

Tags:    

Similar News