మాజీ సీఎం బూర్గులకు సీఎం రేవంత్ నివాళి
హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా, సాహితీవేత్తగా, బహు భాషా వేత్తగా బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞ కనపర్చారని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్, భువనగిరి ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.