కేసీఆర్ మనవడు హిమాన్ష్ ట్వీట్.. అందువల్లే అలా చేశానంటూ వివరణ

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కీలక ప్రకటన చేశారు.

Update: 2023-07-23 17:40 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కీలక ప్రకటన చేశారు. తన తండ్రి పుట్టిన రోజైన జులై 24న తాను రిలీజ్ చేస్తానన్న ప్రెట్టీ అనే పాటను వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్లే తాను ప్రెట్టీ సాంగ్ రిలీజ్ ను మరో తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాగానే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తానని చెప్పారు.

కాగా ఓ ప్రభుత్వ స్యూల్ విషయంలో హిమాన్షు రావు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పాఠశాలల పరిస్థితి చూసి బాధేసిందని, అందుకే తాను ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు హిమాన్షు రావు తెలిపారు. అయితే మనవడికి ఉన్న తెలివి కేసీఆర్ కు లేదంటూ  ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పించారు. 

Tags:    

Similar News