కొండగట్టుకు మహర్దశ.. వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్
కొండగట్టు క్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కొండగట్టు క్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కొండగట్టులో పర్యటించిన సీఎం కేసీఆర్ అంజన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొండగట్టుకు అదనంగా మరో రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికే బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించగా దీనికి అదనంగా మరో రూ.500 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని దీంతో మొత్తం రూ. 600 కోట్ల నిధులతో ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు