బ్రేకింగ్.. మరికొద్ది సేపట్లో పోలీసుల విచారణకు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Update: 2024-12-24 03:03 GMT

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట(Stampede) ఘటనలో హీరో అల్లు అర్జున్(Allu Arjun) ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్(Interim bail) ఇచ్చింది. దీంతో జైలు నుంచి 24 గంటల్లోపే విడుదలైన ఆయన చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీ(Assembly)లో సైతం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హీరో అల్లు అర్జున్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే ప్రెస్ మీట్(Press meet) పెట్టిన అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే హైదరాబాద్ సీపీ(Hyderabad CP) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. అనంతరం న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు.. కేసు కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు(Notices) జారీ చేశారు. డిసెంబర్ 24 ఉదయం(ఈ రోజు) 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఈ నోటీసులను అందుకున్న హీరో అల్లు అర్జున్(Allu Arjun) రాత్రి మొత్తం తన లీగల్ టీం తో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో హీరో అల్లు అర్జున్.. తన లీగల్ టీమ్ తో కలిసి విచారణ కు హాజరుకానున్నారు. దీంతో ఏ క్షణం ఎమ్ జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News