CM కాన్వాయ్.. అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.

Update: 2023-12-14 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం తన కాన్వాయ్ లోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన బ్లాక్ ల్యాండ్ క్రూయిజర్ కారులోనే ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి కారుకు టీఎస్ 07 ఎఫ్ఎఫ్ 0009 నంబర్ ను అధికారులు కేటాయించారు. మిగిలిన కార్లకు టీఎస్ 09 ఆర్ఆర్ 0009 సిరీస్ నంబర్ ఉండనుంది. భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్‌లోని అన్ని కార్లకు ఒకే రంగు ఉండేలా కార్లకు నలుపు రంగు వేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ లోని అన్ని కార్లు తెలుపు రంగులో ఉండేలా ప్లాన్ చేశారు. గులాబీ బాస్ తెలుపు రంగును ఇష్టపడేవారు. కాగా రేవంత్ రెడ్డికి నలుపు రంగు ఇష్టం కావడంతో కార్ల కలర్, సీఎం కాన్వాయ్ చేంజ్ కానుంది.


Similar News