మచిలీపట్నంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రేపు మచిలీపట్నంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం పాల్గొననున్నారు.
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రేపు మచిలీపట్నంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అయితే సీఎం పర్యటన కావడంతో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏపీ అంతటా ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చేల ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని, 'ఆపరేషన్ బుడమేరు' తరహాలో ఏపీలో అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణలకు పాల్పడిన వారు ఏ రాజకీయ పార్టీ వారైనా.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి నారాయణ అన్నారు.