Film Industry : సినిమా పెద్దలు కాదు గద్దలు : కామన్ మ్యాన్ ఫైర్ !

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన..అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటనతో దిగివచ్చిన సినీ ఇండస్ట్రీ (Film Industry)పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎంతో భేటీ అయ్యారు.

Update: 2024-12-26 06:45 GMT
Film Industry : సినిమా పెద్దలు కాదు గద్దలు : కామన్ మ్యాన్ ఫైర్ !
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన..అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటనతో దిగివచ్చిన సినీ ఇండస్ట్రీ (Film Industry)పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎంతో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. అదే సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ బయట కామన్ మ్యాన్ పేరుతో ఓ వ్యక్తి చేసిన హల్చల్ సైతం అంతే చర్చనీయాంశమైంది. 'సినిమా పెద్దలు కాదు గద్దలు' (Cinema peddhalu kadhu Gaddhalu)అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించిన కామన్ మ్యాన్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

సీఎంతో సినిమా పెద్దల భేటీ అంటున్నారని.. కేవలం డబ్బులున్న వారే పెద్దలా అని..వందల కోట్లకు పైగా సినిమాలు తీసే వారే సినీ పెద్దలా అంటూ ప్రశ్నించారు. ఒక సామాన్య ప్రేక్షుకుడిగా నా ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళన చేపట్టినట్లుగా తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అంటే కార్మికులు, ప్రేక్షకులు కూడా అని సీఎం గుర్తించాలన్నారు. మాతో కూడా భేటీ కావాలని మా వాదన సమస్యలు కూడా వినాలని కోరాడు. భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే మధ్యతరగతి, సామాన్య ప్రజల కోసం థియేటర్ 60శాతం టికెట్ల ధరలను పెంచవద్దని, అప్పర్ క్లాస్ టికెట్లను కూడా పరిమిత రోజులతో పెంచుకోవడంపై అభ్యంతరం లేదని అతను పేర్కొన్నారు.

Tags:    

Similar News