కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలి: చనగాని దయాకర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు.

Update: 2024-07-25 16:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రాష్టానికి నిధుల కేటయింపులో అన్యాయం జారినందున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు దాటిన కేంద్ర ప్రభుత్యం తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయడంలో పూర్తి విఫమైందన్నారు. దేశవ్యాప్తంగా 21 ఐఐఎంలు ఉన్న తెలంగాణపై మోడీ విషం కక్కుతున్నారని చనగాని దయాకర్ ద్యజమెత్తారు. రాష్టానికి రావలిసిన కేంద్ర జాతీయ విద్యాలయలను నెలకొల్పే వరకు పోరాటం ఆగదని అన్నారు. మెట్రోపాలిటీ నగరాల్లో కేంద్ర జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్యం మొండివైఖరి అవలంభిస్తుందని విమర్శించారు. 


Similar News