BREAKING: సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ కల్పతరువు సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని లోక్ సభ

Update: 2024-07-24 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కల్పతరువు సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని లోక్ సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. కాగా, బుధవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా.. సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీ వంశీ ప్రశ్నకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రిప్లై ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలంటే సంస్థలో 51 శాతం వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమే కీలకమని నొక్కి చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అంశం స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉందని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఒడిషాతో చర్చించి సింగరేణికి ఒక బొగ్గు గనిని కేటాయించామని తెలిపారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కిషన్ రెడ్డి తాజా ప్రకటనతో సింగరేణి ప్రైవేటీకరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 


Similar News