‘ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా?’.. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫైర్

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Update: 2024-10-23 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యే ఫిరాయింపులు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ నాయకుడే అంటున్నారని, ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘‘సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు. ఇప్పటికైనా మీ తప్పును ఒప్పుకుంటారా..? మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా..? ఇప్పుడు ఎవరిని రాయితో కొట్టాలి..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా..? ప్రోత్సహించిన మిమ్మల్నా..?’’ అంటూ ఫైర్ అయ్యారు.



Similar News