కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు క్యూకట్టిన సెలబ్రేటీలు
తెలంగాణలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు నేడు సినీ ప్రముఖులు నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు నేడు సినీ ప్రముఖులు(Movie celebrities) నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవనున్నారు. ఈ సమావేశానికి కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) వేధిక కాగా.. ముందుగానే.. సినీ ప్రముఖులు అక్కడికి క్యూ కట్టారు. ఇందులో భాగంగా.. దిల్‌రాజు, అల్లు అరవింద్ లు ముందగానే సీసీసీకి వచ్చారు. మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్ కొరటాల శివ, వశిష్ట, సాయి రాజేష్, బోయపాటి, సి.కల్యాణ్‌తో పాటు దిల్‌రాజు నేతృత్వంలో హాజరుకానున్న 36 మంది సభ్యులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకుంటున్నారు. వీరిలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేంద్ర సీసీసీకి చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీసీసీకి చేరుకోనున్నారు. కాగా సినీ ప్రముఖులు సెలబ్రేటీలు వస్తుండటంతో..ఆ ప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమావేశంలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ఏ ఏ అంశాలపై చర్చిస్తారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సమావేశానికి టాలీవుడ్ కు పెద్దన్నగా ఉన్న చిరంజీవి కూడా వస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఆయన చివరి నిమిషంలో రావడం లేదని సమాచారం అందించారు. అందుబాటులో లేకపోవడం వల్లే సీఎంతో మీటింగ్ కు రాలేకపోతున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.