తెలంగాణ మంత్రుల మార్ఫింగ్ వీడియోపై కేసు నమోదు

రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది.

Update: 2024-08-02 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సీసీఎస్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. గురువారం అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా.. వెనకాలే కూర్చున్న పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలను కొందరు మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి ట్రోలింగ్స్ చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘాటు స్పందించారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. కాగా, సీతక్క, పొన్నం ప్రభాకర్ మద్దతుదారులు సైతం సదరు మీమ్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.

Tags:    

Similar News