'టీచర్ పోస్టుల తగ్గింపుపై అభ్యర్థుల ఆగ్రహం'

రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ సాక్షిగా 13086 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి

Update: 2023-09-08 16:57 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ సాక్షిగా 13086 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం 5089 పోస్టులకు తగ్గించి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల టీఆర్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు కేవలం 2 నెలల సమయం ఉండగా టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ఖాళీలు ఇందులో కలపడం లేదు. అనేక ఉద్యోగ పరీక్షలకు 6 నుండి 8 నెలల సమయం ఇస్తున్న ప్రభుత్వం తక్కువ ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వారు తప్పు బడ్తున్నారు. టెట్ పరీక్ష జరగక ముందే ఫలితాలు రాకముందే (టెట్ రిజల్ట్స్ 27 అక్టోబరు ) టీఆర్‌టీ /డీఎస్‌సీ ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 నుండి అని నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం, సిలబస్ 20 న ఇస్తామని పేర్కొని పరీక్ష 2 నెలల వ్యవధిలోనే అంటే నవంబర్ 20 నుండి నిర్వహిస్తుండడం పట్ల అభ్యర్థులు సమయాభావం లేదని వాపోతున్నారు.

పరీక్షలకు 4 నెలల సమయం ఇవ్వాలనీ అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు. అర్హత పరీక్షల కాకుండా తమ జీవితాలను నిలిపే ఒక ఉద్యోగ పరీక్షగా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవహరించాలని ఉపాధ్యాయ ఉద్యోగానికి పోటీ పడుతున్న బాలస్వామి అనే అభ్యర్థి పేర్కొన్నారు. అన్ని పరీక్షలకు 6 నుండి 8 నెలల సమయం ఇస్తూ ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్, డీఏఓ అక్టోబర్, నవంబర్‌లో ఉండగా ఉపాధ్యాయ పరీక్షను మాత్రం ఎందుకు ఇంత హడావిడిగా పరీక్ష నిర్వహిస్తుండటాన్ని తప్పు బడ్తున్నారు. పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరిలో నిర్వహణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష ఫీజు 2017 లో 200 ఉండగా.. ఇప్పుడు 1000 రూపాయలు చేయటం పై భగ్గుమంటున్నారు. ఇకనైనా అభ్యర్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాల సంఖ్యను, పరీక్షల సమయాన్ని పెంచాలని టీఆర్టీ అభ్యర్థుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Similar News