Cabinet Meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర

2025-26 వార్షిక బడ్జెట్‌ (Annual Budget)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది.

Update: 2025-03-19 05:05 GMT
Cabinet Meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ (Annual Budget)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రి‌వర్గం బడ్జెట్‌ ఆమోద ముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), అటు శాసన‌మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ సర్కార్ Congress Government) అధికారంలోకి వచ్చిన తరువాత రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందని అటు విపక్షాల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

కాగా, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా ఆరు గ్యారంటీ (Six Guarantees)ల అమలుపైనే దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ‌పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం

Read More..

Cabinet Meeting: కేబినెట్ సమావేశం ప్రారంభం.. బడ్జెట్ ఆమోదమే తరువాయి!  

Tags:    

Similar News