BRS:ఎండు మిర్చి దండలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వెరైటీ నిరసన
శాసనమండలిలో కల్వకుంట్ల కవిత వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాసనమండలి ఆవరణంలో బీఆర్ఎస్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మిర్చి పంటకు వెంటనే రూ. 25,000 గిట్టుబాటు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో (Kavitha) పాటు ఆ పార్టీ ఎమ్మెల్సీలు (BRS MLCs) ఎండు మిర్చిలతో తయారు చేసిన దండలను (Chilli garlands) ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైతే, ధర లేక ఈ సీజన్లో 2 లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు రూ.25 వేల గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాడంతో పాటు రాష్ట్రంలో పండుతున్న మిర్చి పంట విదేశాలకు ఎగుమతి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.