ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా.. MLA ప్రకటన

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుస షాక్‌లు ఇస్తోన్న విషయం తెలిసిందే. కొందరు కాంగ్రెస్‌ గూటికి చేరగా.. మరికొందరు బీజేపీ గూటికి చేరిపోతున్నారు.

Update: 2024-03-26 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుస షాక్‌లు ఇస్తోన్న విషయం తెలిసిందే. కొందరు కాంగ్రెస్‌ గూటికి చేరగా.. మరికొందరు బీజేపీ గూటికి చేరిపోతున్నారు. గేట్లు తెరిచామని.. బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయి లీడర్లలో పార్టీ భవిష్యత్‌పై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలోనే మరికొంత మంది కూడా కాంగ్రెస్‌ గూటికి చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా వినిపించింది.

తాజాగా.. కౌశిక్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించారు. తాను ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారబోను అని స్పష్టం చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న వార్తలను కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తోనే ఉంటాన‌ని తేల్చిచెప్పారు. ఈ మేర‌కు కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుద‌ల చేశారు. అంతేకాదు.. ఇలాంటి త‌ప్పుడు వార్తలు రాసిన మీడియా ఛానళ్లు, జ‌ర్నలిస్టులపై లీగ‌ల్ చ‌ర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. త్వర‌లోనే లీగ‌ల్ నోటీసులు పంపించడంతో పాటు ప‌రువు న‌ష్టం దావా కూడా వేస్తానని ప్రకటించారు.

Tags:    

Similar News