పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Update: 2024-09-11 11:16 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పందించిన తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఖండించారు. అలాగే వారికి చీరలు, గాజులు పంపుతున్నాను అని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతున్నాడని.. అతన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు రిజక్ట్ చేశారని.. త్వరలో దానం.. శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా నిలిచిపోతాడని చెప్పుకొచ్చారు. కడియం శ్రీహరి కూడా చీటర్ అని.. ఆయనకు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాటలు మారుస్తున్నాడని.. ఆయన నకిలీ గాంధీ గా మారిపోయాడని.. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరాడు.


Similar News