BRS: హైడ్రా మీదున్న ప్రేమ.. ఆ సామాజికవర్గంపై ఎందుకు లేదు?

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Ravi Shankar Sunke) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-08 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Ravi Shankar Sunke) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అసెంబ్లీలో చెప్పారు. దీంతో ఆగస్టు 1వ తేదీన తెలంగాణలో మాదిగలు పండుగ చేసుకున్నారని రవిశంకర్ గుర్తుచేశారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు అయితే డీఎస్సీలో 1200 ఉద్యోగాలు మాదిగలకు వచ్చేవని అన్నారు. హైడ్రాకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణపై ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

హైడ్రాపై ఉన్న ప్రేమ మాదిగలపై ఎందుకు లేదని అడిగారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి మాదిగలు అంటే చిన్నచూపని మండిపడ్డారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు, నామినేటెడ్ పదవుల్లో చోటు లేదని అన్నారు. తెలంగాణలో తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినామని గుర్తుచేశారు. తెలంగాణలో నియంతలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


Similar News