ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

అమాయక ప్రజలను మోసం చేస్తూ.. వారి ఖాతాల నుండి డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-08 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమాయక ప్రజలను మోసం చేస్తూ.. వారి ఖాతాల నుండి డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ బాధితునికి ఫోన్ చేసి.. 'మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.. గుర్తు తెలియని వ్యక్తి విదేశాల నుండి మీకు ఓ కొరియర్ పంపించారు. దానిలో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. వెంటనే మీరు జరిమానా కట్టకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తాం..' అంటూ బెదిరించి, బాధితుని ఖాతా నుండి పలు విడతలుగా రూ.10.61 కోట్లు కాజేశారు నిందితులు. ఎన్నిసార్లు డబ్బు పంపినా ఫోన్ కాల్స్ రావడం ఆగకపోవడంతో.. అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు మారుతి, వినయ్ కుమార్ లు బెంగుళూర్ లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయంతో వారిద్దరిని అరెస్ట్ చేసి, నగరానికి తీసుకు వచ్చారు. అయితే నిదితులకు దేశంలోని పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వీరి నుండి రికవరీ చేసిన డబ్బును బాధితునికి అందజేస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలియ జేశారు.      


Similar News