సైబర్ మోసగాళ్లు కొట్టేస్తే.. పోలీసులు రికవరీ చేశారు..
సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు హైదరాబాద్ సీసీఎస్
దిశ, సిటీ క్రైమ్ : సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరటను అందించారు. బాధితులు పొగొట్టుకున్న డబ్బును తిరిగి వారి ఖాతాల్లోకి వచ్చేలా చేసి వారిలో ఆనందం నింపారు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెంబర్ 96/2024, క్రైమ్ నెంబర్ 1993/2024 కేసుల లోని మొత్తం రూ. 21.55 లక్షలను రికవరీ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఈ రెండు కేసులలో నిందితులు 67, 52 వయస్సు గల వారిని ఇన్వెస్ట్ మెంట్, సీబీఐ పేరుతో టోకరా కొట్టించి రూ.21.55 లక్షలను కొట్టేశారు. ఈ చీటింగ్ పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో సమర్ధవంతంగా ఏసీపీలు శివ మారుతి, చాంద పాషా సారధ్యంలోని సైబర్ క్రైం టీం సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోని నగదును ఫ్రీజ్ చేసి వాటిని కోర్టు అనుమతితో తిరిగి వారి ఖాతాల్లోకి చేర్చారు.