RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఇతర అధికారులతో కలిసి సచివాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులపై డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను అధికారులు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాద్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల పై నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.