Nayini Rajendar Reddy : బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్ళడం ఖాయం : నాయిని రాజేందర్‌రెడ్డి

బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి(MLA Nayini Rajendar Reddy) ఫైర్ అయ్యారు.

Update: 2024-11-18 10:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి(MLA Nayini Rajendar Reddy) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారని, ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. అలాంటి వారు ఇపుడు సిగ్గులేకుండా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్న మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతి త్వరలోనే బయటకు వస్తుంది.. రేపో మాపో వారంతా జైలుకు వెళ్ళడం తథ్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కాళోజీ కళాక్షేత్రంపై చర్చకు రావాలని నాయిని రాజేందర్ డిమాండ్ చేశారు.  


Similar News