Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్(Stationa Ghanpur) నియోజకవర్గంలో నేడు జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పాల్గొని ప్రసంగించారు.

Update: 2025-03-16 11:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్(Stationa Ghanpur) నియోజకవర్గంలో నేడు జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినప్పటికీ బీఆర్ఎస్(BRS) నాయకులు మాత్రం పగటి కలలు కనడం మానలేదని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే ఎందుకు కూలిపోయిందని మండిపడ్డారు. సభలో స్పీకర్ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

అపార అనుభవం అని చెప్పుకునే వాళ్ళు 15 నెలల్లో రెండుసార్లు మాత్రమే సభకు వచ్చారని, ఆ అనుభవంతో సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను మెచ్చుకోకపోయినా.. అభివృద్ధిని అడ్డుకోకుండా ఉంటే చాలని అన్నారు. జగన్ తో కుమ్మక్కయ్యి కృష్ణా జలాలను(Krishna Water) ఏపీ చేతిలో పెట్టి ఇప్పుడు కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నాయకులు నాటకాలు అడుతున్నారని పేర్కొన్నారు. లోక సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీ వాళ్ళు ఇంకా కలలు కంటున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు.

Read More..

స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మాజీ మంత్రుల దిష్టిబొమ్మలు దహనం 

Tags:    

Similar News