గరం గరం ఇరానీ చాయ్.. నిలోఫర్ కేఫ్‌లో హరీశ్‌రావు సీరియస్ డిస్కషన్!
టీ లవర్స్ సేద తీరాలంటే గరం గరం ఇరానీ చాయ్ తాగి ప్రశాంతంగా ఉంటారు. మరి ఏ డీల్స్ అయిన కూడా ఇరానీ...
దిశ, డైనమిక్ బ్యూరో: టీ లవర్స్ సేద తీరాలంటే గరం గరం ఇరానీ చాయ్ తాగి ప్రశాంతంగా ఉంటారు. మరి ఏ డీల్స్ అయిన కూడా ఇరానీ హోటల్స్‌లోనే జరుగుతాయనే టాక్ కూడా ఉంది. ఎలాంటి మ్యాటర్ అయిన అక్కడ చాయ్ తాగుతూ సమస్యకు పరిష్కారం వెతుకుతుంటారు. మరోవైపు చిన్న నుంచి పెద్ద అనే తేడాకుండా దాదాపు అందరూ చాయ్‌ని ఇష్టపడుతారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కప్పు ఇరానీ చాయ్ తాగుతూ కనిపించారు. మరోవైపు ఉస్మానియా బిస్కెట్లు కూడా తీసుకున్నారు.
తెలంగాణ భవన్ వెనుక బంజారా హిల్స్‌లోని ప్రఖ్యాత కేఫ్ నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతలతో కలిసి సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కానీ హరీశ్‌రావు సరదాగా వారి సహచర నేతలతో ముచ్చటించారు. కాగా, గతంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం నిలోఫర్‌లో చాయ్ తాగి అక్కడికి వచ్చిన వారితో సరదాగా ముచ్చటించి వారికి సెల్ఫీలు ఇచ్చారు.