BRS: నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు(Telangana Police) బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు(BRS Leaders Arrest) చేశారు.

Update: 2024-11-08 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు(Telangana Police) బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు(BRS Leaders Arrest) చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి(Yadadri) లక్ష్మీ నరసింహ స్వామిని సందర్శించిన అనంతరం మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వలిగొండ(Valigonda) మండలం సంగెం(sangem) గ్రామం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై కార్యకర్తలతో సహా సీఎం పాదయాత్ర ప్రాంగణానికి వెళ్లాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి పాదయాత్ర ఉండటంతో జిల్లాలో ఎలాంటి అవాంచిత ఘటనలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ నేతలను నిర్భందించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలను హౌజ్ అరెస్ట్ చేయగా.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

Tags:    

Similar News