BRS: శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి(Srikantha Chary) వర్ధంతి(Death Anniversary) సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) నివాళులు(Tributes) అర్పించారు.

Update: 2024-12-03 05:46 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి(Srikantha Chary) వర్ధంతి(Death Anniversary) సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) నివాళులు(Tributes) అర్పించారు. దీనిపై హరీష్ రావు స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంతా చారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై అగ్నికి ఆహుతి అవుతూ 'జై తెలంగాణ''(Jai Telangana) అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు అని కీర్తించారు. అలాగే కేసీఆర్ అరెస్టును, ఉద్యమ కారులపై ప్రభుత్వ అణిచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళి అంటూ.. జోహార్ శ్రీకాంతాచారి అని నినదించారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న శ్రీకాంతా చారి 2009 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Tags:    

Similar News