అదానీకి సిమెంట్ కంపనీకి భూములిప్పించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే వేముల

రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ కంపనీ ఏర్పాటుకు వీలుగా అదానీ గ్రూప్ వాళ్ళు 350ఎకరాల భూములు కోనుగోలుకు సహకరించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు.

Update: 2024-10-23 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ కంపనీ ఏర్పాటుకు వీలుగా అదానీ గ్రూప్ వాళ్ళు 350ఎకరాల భూములు కోనుగోలుకు సహకరించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. అదానీ గ్రూపుకు మద్దతునిచ్చి, భూముల కొనుగోలు జరిపించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. వారి ప్రభుత్వమే అక్కడ కంపనీ పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసిందన్నారు. వాళ్ళు చేసిన పాపం, శాపం, దుర్మార్గమే ఇప్పుడు కంపనీ రావడానికి కారణమైందన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వారే..పర్మిషన్లు ఇచ్చినోళ్లు బీఆర్ఎస్ పాలకులేనన్నారు.ఇప్పుడు కంపనీ పనులు మొదలు పెడుతుంటే అందుకు కాంగ్రెస్ కారణమని బద్నామ్ చేయడం, వారు చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టడం దుర్మార్గ చర్య అని వీరేశం మండిపడ్డారు. 

కాగా రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ కంపనీ ఏర్పాటుకు సంబంధించి బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కంపనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ ప్రజాభిప్రాయ ప్రక్రియ పిదప సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వెళుతుండగా, ఆయన కారును స్థానికులు అడ్డుకొన్న క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.


Similar News