BRS: న్యూఇయర్ వేళ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పురోగతి(Progress) దిశగా ప్రభుత్వాలు(Governments) కృషి చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(BRS President KCR) సూచించారు.

Update: 2024-12-31 15:30 GMT

దిశ, వెబ్ డెస్క్: పురోగతి(Progress) దిశగా ప్రభుత్వాలు(Governments) కృషి చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(BRS President KCR) సూచించారు. న్యూఇయర్(New Year) సందర్భంగా కేసీఆర్ ఓ ప్రకటనలో తెలంగాణ ప్రజలకు విషెస్(Wishes) చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అంతేగాక కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. ఇక నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు.

Tags:    

Similar News