BRS: సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్

సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) కేటీఆర్, హరీష్ రావులను పోలీసులను హౌజ్ అరెస్ట్(House Arrest) చేశారు.

Update: 2025-01-14 03:54 GMT
BRS: సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) కేటీఆర్, హరీష్ రావులను పోలీసులను హౌజ్ అరెస్ట్(House Arrest) చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy)ని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేట(Kokapeta)లోని మాజీమంత్రి హరీష్ రావు(harish Rao Thanneeru) నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే గచ్చిబౌలి(Gacchibowli)లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాగా ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఈ కార్యక్రమంలో రసభసా జరిగింది. ఈ ఘటనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News