BRS: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి షరతులు విధించొద్దు.. మాజీమంత్రి హరీష్ రావు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని(Indiramma Atmiya Bharosa Scheme) రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీమంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని(Indiramma Atmiya Bharosa Scheme) రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీమంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశానికి(Medak District Review Meeting) వర్చువల్ గా హజరైన హరీష్ రావు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అమలు చేయబోయే ఇందిరమ్మ రైతు భరోసా పథకానికి షరతులు విధించకుండా రైతు కూలీలందరికీ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే గుంట భూమీ ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని, రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,5700 మంది ఉన్నారని తెలిపారు. ఈ పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. అంతేగాక నియోజకవర్గానికి 3500 ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని, గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కోరారు. ఇక ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు పేదలకు చేసేలా ఉండాలని, ఆ దిశగా ప్రభుత్వం విధివిధానాల రూపకల్పన చేయాలని హరీష్ రావు అన్నారు.