లంబాడీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించండి.. సీఎంకు ఎమ్మెల్యేల లేఖ

లంబాడీ సామాజిక వర్గం నేతలకు ప్రాతినిథ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

Update: 2025-03-26 13:40 GMT
లంబాడీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించండి.. సీఎంకు ఎమ్మెల్యేల లేఖ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: లంబాడీ సామాజిక వర్గం నేతలకు ప్రాతినిథ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి లేఖ (Letter) రాశారు. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ (Cabinet expansion)పై జోరుగా చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఇప్పటికే 12 మంది మంత్రులు ఉండగా.. కొత్తగా మరో నలుగురికి లేదా ఆరుగురికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధిష్టానం రెండు రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కూడా జరిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు సేకరించి, మంత్రి వర్గంలోకి తీసుకొబోయే నేతల పేర్లు కూడా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే లంబాడీ సామాజిక వర్గానికి (Lambadi community) చెందిన ఎమ్మెల్యేలు బాలు నాయక్ (MLA Balu Nayak), రామచంద్రనాయక్ (Ramachandra Nayak), మాలోత్ రాందాస్ (Maloth Ramdas) సహా పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి వర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరుతూ రాసిన లేఖను సీఎంకు అందించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న లంబాడీ సామాజిక వర్గం గత ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ కు అండగా నిలచిందని ప్రస్తావించారు. 32 లక్షల జనాభా ఉన్న లంబాడీలకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ లంబాడీల అభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తున్నామని వారు అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లకు కూడా లేఖ రాశామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) తెలిపారు.   

Tags:    

Similar News