Breaking: పండగ పూట కేటీఆర్‌కు బిగ్ షాక్
పండగ పూట తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది..
దిశ, వెబ్ డెస్క్: పండగ పూట తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(Former Minister Ktr)కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-రేసు(Farmula E Car Race) కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో SLP వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో బేలా ఎం. త్రివేది ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టే విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు.
అడ్వొకేట్ సుందరం వాదనలివే..
అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కేటీఆర్ తరపున అడ్వొకేట్ సుందరం వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అని ఆయన తెలిపారు. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని వాదించారు. ‘‘ఇది ప్రభుత్వ ప్రాజెక్టు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం గుర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ ఎం డి ఎ ను నిందితులుగా చేర్చలేదు’’ అని సుందరం పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు ఇవే..
తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రొహత్గి వాదనలు వినిపించారు. కేసులో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారని గుర్తు చేశారు. గవర్నర్ దర్యాప్తునకు కూడా అనుమతి ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఏ1గా కేటీఆర్
కాగా ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. దీంతో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. కేసును క్వాష్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది.