MLA Rakesh Reddy: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్లు

ఆర్మూర్ బీజేపీ(BJP) ఎమ్మె్ల్యే పైడి రాకేశ్ రెడ్డి(MLA Rakesh Reddy)కి వ్యతిరేకంగా మరోసారి వాల్ పోస్టర్లు(Posters) వేయడం నియోజకవర్గంలో కలకలం రేపింది.

Update: 2025-01-15 06:42 GMT
MLA Rakesh Reddy: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్లు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఆర్మూర్ బీజేపీ(BJP) ఎమ్మె్ల్యే పైడి రాకేశ్ రెడ్డి(MLA Rakesh Reddy)కి వ్యతిరేకంగా మరోసారి వాల్ పోస్టర్లు(Posters) వేయడం నియోజకవర్గంలో కలకలం రేపింది. రూపాయికి వైద్యం ఆసుపత్రి ఎక్కడ, యువతకు ఉపాధి ఎక్కడ, ఏడాదికి ఊరికి 10ఇండ్లు సొంతంగా నిర్మిస్తానన్న హామీతో పాటు ఇతర ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ పోస్టర్లు వేశారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గం ప్రజలు రావొద్దంటారని..పేద ప్రజలంటే చులకనా అంటూ పోస్టర్ లో ప్రశ్నించారు.

ఉపాధి కోసం యువతను విదేశాలకు పంపుతానంటూ వారి సమాచారం తీసుకుని ఆగం చేస్తున్నావని..ప్రభుత్వ అధికారులను దూషిస్తున్నాంటూ ఆరోపించారు. ధనవంతులను నా వద్దకు రావద్దని..పేదవారు వస్తే సహాయం చేయవని పోస్టర్ లో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. నందిపేట మండలంతో పాటు ఆర్మూర్ పట్టణం ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు వేశారు. ఇటీవల రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వరుసగా వెలియడం వెనుక తన రాజకీయ ప్రత్యర్థుల హస్తముందని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News