BREAKING: బీఫ్ జిందాబాద్ అంటూ రెచ్చగొడుతున్నారు: ఎంఐఎం చీఫ్‌పై ఈసీకి మాధవీ లత ఫిర్యాదు

రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Update: 2024-04-22 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రోజుకో నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా క్యాంపెయినింగ్‌లో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో లోక్‌సభ ప్రచారం పూర్తిగా మతం రంగు పులుముకుంది. ఇటీవలే ఓ ర్యాలీలో మసీదును లక్ష్యంగా చేసుకుని బీజేపీ అభ్యర్థి మాధవీ లత రాముడు బాణాన్ని సంధిస్తున్నట్లుగా ఫోజులిచ్చారు. అయితే, ఆ విషయంపై ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, అసద్దుద్దీన్ మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అసదుద్దీన్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ జిందాబాద్ అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమ అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News